క్రిమినల్స్ కు ఎస్పీ టికెట్స్ ఇవ్వడంపై యోగి సీరియస్

 క్రిమినల్స్ కు ఎస్పీ టికెట్స్ ఇవ్వడంపై యోగి సీరియస్
  • క్రిమినల్స్ కు ఎస్పీ టికెట్స్ ఇవ్వడంపై యోగి ఆగ్రహం
  • నహీద్ హసన్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్

ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అందరికంటే ముందుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాజ్ వాదీ పార్టీని టార్గెట్ గా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. నేర చరిత్ర ఉన్న క్రిమినల్స్ కు ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తున్నారని మండిపడ్డారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే వాళ్లందరినీ న్యాయస్థానం ముందుకు తీసుకువస్తానని ప్రకటించారు యోగి  ఆదిత్యనాథ్. క్రిమినల్స్ కు టికెట్స్ ఇవ్వడం ద్వారా సమాజ్ వాదీ పార్టీ నిజ స్వరూపం మరోసారి బయటపడిందని మండిపడ్డారు. కైరానా సిట్టింగ్ ఎమ్మెల్యే నహీద్ హసన్ కు ఎస్పీ టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నహీద్ పై  2021లో గ్యాంగ్ స్టర్ చట్టం కింద కేసు నమోదు అయ్యింది.  హసన్ నామినేషన్ వేసేందుకు  పత్రాలు తీసుకుని వెళ్తుండగా పోలీసులు అతడిని మార్గ మధ్యలో అడ్డుకుని  అరెస్ట్ చేశారు. నేర చరిత్ర ఉన్న నహీద్ ను వెంటనే పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అటు అఖిలేష్ యాదవ్ కూడా బీజేపీ అక్రమ అరెస్ట్ ను  తీవ్రంగా ఖండించారు.