పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ యోగి సినిమా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణతో పాటు ఏపీలో యోగి సినిమా రీ రిలీజ్ అయింది. అయితే యోగి రీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఈ మూవీ చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్లోని రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో వీరు థియేటర్లో రచ్చ రచ్చ చేశారు. సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ స్క్రీన్తో పాటు.. అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే క్యాంటిన్ సమీపంలో ఉన్న కూల్ డ్రింక్స్ బాటిళ్లను పగలగొట్టారు.
థియేటర్లో హంగామా సృష్టించిన ప్రభాస్ ఫ్యాన్స్ను సుదర్శన్ థియేటర్ యాజమాన్యం అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై చిక్కడపల్లి పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
సుదర్శన్ థియేటర్ దగ్గర రచ్చ
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2023
యోగి సినిమా చూడడం కోసం వచ్చిన పలు వర్గాల ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగి థియేటర్ మీద దాడి చేసిన ఫ్యాన్స్. pic.twitter.com/U4e4y88AKo
సుదర్శన్ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తుండగా..ఓ వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఆ వీడియోలో కొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్ కూల్ డ్రింక్స్ పగులకొడుతున్నట్లు ఉంది.
ప్రభాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యోగి’. ఈ మూవీ 2007 జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. అయితే ఆ సమయంలో యోగి మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. ప్రభాస్‌కు తల్లిగా శారద నటించారు. ప్రదీప్ రావత్, అలీ, సుబ్బరాజు, కోటా శ్రీనివాసరావు, చంద్రమోహన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రమణ గోగుల సంగీతం అందించారు. 2005లో కన్నడలో వచ్చిన ‘జోగి’ సినిమాకు ఇది రీమేక్. అప్పుడు ఫ్లాప్ అయిన ఈ సినిమాను ఆగస్టు 18వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు.
