టైమ్‌కు టీకాలు ఇచ్చుంటే కరోనా విజృంభించేదా?

టైమ్‌కు టీకాలు ఇచ్చుంటే కరోనా విజృంభించేదా?

జల్‌పైగురి: కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలకు దిగారు. తమ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు కేంద్ర నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. సరైన సమయానికి ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చుంటే కరోనా కేసులు ఇంతగా నమోదు కాకపోవునని స్పష్టం చేశారు. నార్త్ బెంగాల్‌‌లోని జల్‌‌పైగురిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇతర రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో తమ కార్యకర్తలను బెంగాల్‌‌లో ఎన్నికల ప్రచారానికి తీసుకొస్తూ కరోనా వైరస్ విజృంభణకు బీజేపీ కారణమవుతోందని మమత ఫైర్ అయ్యారు. ‘ఇన్ని రోజులు మీరు ఎక్కడికెళ్లారు. రాష్ట్రంలో కరోనా రాకకు మీరే (బీజేపీ) కారణం. మేం కరోనా పరిస్థితులను నివారించాం. కానీ అదే ప్రజలకు టీకా అందించి ఉంటే కరోనా కేసులు నమోదయ్యేవి కాదు. ఎన్నికల ప్రచారం పేరుతో బయటి రాష్ట్రాల వ్యక్తులను బెంగాల్‌‌లోకి తీసుకొస్తూ బీజేపీ కరోనాను వ్యాప్తి చేస్తోంది’ అని మమత ఆరోపించారు. అయితే దీదీ కామెంట్లను బీజేపీ ఖండించింది.