అమెరికా స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు

అమెరికా స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు

ప్లాట్‌ఫామ్‌లను ఆఫర్ చేస్తోన్న బ్రోకరేజ్‌లు

న్యూఢిల్లీ :ఫారిన్ స్టాక్ మార్కెట్లపై ఇండియన్లకు ఆసక్తి పెరుగుతుండటంతో, అమెరికా స్టాక్ మార్కె ట్‌లో డైరెక్ట్ గా‌‌ ఇన్వెస్ట్ చేసేలా బ్రోకరేజ్ కంపెనీలు పలు ప్లాట్‌ఫామ్‌లను లాంఛ్ చేశాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌ పాపులర్ అమెరికా స్టాక్స్ ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ , నెట్‌ఫ్లిక్స్, గూగుల్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసేలా అవకాశం కల్పిస్తున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు కనీసం ఇన్వెస్ట్‌‌మెంట్ సైజ్ అంటూ ఏమీలేదు. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక డాలర్ కంటే తక్కువ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక స్టాక్ కంటే తక్కువగా కూడా కొనవచ్చు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ సెక్యూరిటీస్, మేటర్‌ట్రస్ట్, విన్‌‌వెస్టా, వెస్టెడ్ ఫైనాన్స్ వంటి కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ఇటీవలే గ్లోబల్ ఇన్వెస్టింగ్ సర్వీసులను ప్రారంభించాయి. ఆన్‌‌లైన్ బ్రోకరేజ్ సంస్థ జెరోదాకూడా తన ట్రేడింగ్ ప్లాట్ ఫామ్‌పై అమెరికా స్టాక్స్‌ను ఆఫర్ చేయాలని చూస్తోంది. కరోనా వల్ల ఈ ప్లాన్స్ ఆలస్యమవుతున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్స్ బ్రోకరేజ్ ఛార్జీలు కూడా వసూలు చేయడం లేదు.
ఎన్నో అసెట్‌ క్లాస్‌‌లు..
గ్లోబల్ స్టాక్స్, గ్లోబల్ బాండ్స్, ట్రెజరీ బాండ్స్ వంటి అసెట్క్లాస్‌లలో వీటి ద్వారా ఇన్వెస్ట్‌‌ చేయవచ్చు. అకౌంట్ ఓపెనింగ్ నుంచి బ్రోకరింగ్ , పోర్ట్‌‌ఫోలి‌యో మానిటరింగ్ అండ్ స్టేట్‌మెంట్స్ వంటి ప్రతీది డిజిటల్‌గా అందించనున్నాయి. బేసిక్ ప్లాన్, ప్రీమియం ప్లాన్ రెండింటినీ ఈ ప్లా ట్‌ఫామ్స్ ఆఫర్ చేస్తాయి. ప్రీమియం ప్లాన్ కింద ఫీజులు చెల్లిస్తే.. ఇన్వెస్టర్ల‌కు అదనపు సర్వీసులు
లభిస్తాయి. యాక్సిస్ సెక్యూరిటీ ప్రీమియం ప్లాన్ జీరో అకౌంట్ ఓపెనింగ్ ఫీజులు, జీరో బ్రోకరేజ్, వన్ ఇయర్ ఫీజు విత్‌డ్రాయల్ బెనిఫిట్ స్‌ను ఆఫర్ చేస్తోంది. విన్‌‌వెస్టా తన ప్రీమియం కస్టమర్లు ఇంటర్నేషనల్ మల్టి కరెన్సీ అకౌంట్ లో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. వెస్టెడ్ ఫైనాన్స్ కూడా తన రిటైల్ ఇన్వెస్టర్ల‌కు ఫాంగ్ ప్లస్ఎం(ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్,నెట్‌ఫ్లిక్స్,
గూగుల్, మైక్రోసాఫ్ట్‌‌) వంటి పాపులర్ స్టాక్స్‌ను ఆఫర్ చేస్తోంది.