స్లోగా తిని కూడా బరువు తగ్గొచ్చు

స్లోగా తిని కూడా బరువు తగ్గొచ్చు

బరువు తగ్గాలనుకునేవాళ్లు ఇకనుంచి ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు, డైటింగ్‌‌లు చేయాల్సిన పని లేదట! స్లోగా తిని కూడా బరువు తగ్గొచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్‌‌.  స్లోగా తినేవాళ్లకంటే ఫాస్ట్‌‌గా తినేవాళ్లు 115 శాతం ఎక్కువలావు అవుతారని సర్వేలు చెప్తున్నాయి. దాదాపు 4,000  మందిపైన చేసిన ఒక సర్వేలో ఈ విషయాన్ని చెప్పారు ఫిట్‌‌నెస్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌. 

  •  ఫాస్ట్‌‌గా తినేటప్పుడు పొట్టకు.. సిగ్నల్‌‌ ఇచ్చే టైం బ్రెయిన్‌‌కు ఉండదట. అందుకే ఎక్కువగా తినేస్తుంటారు. అదే నెమ్మదిగా తింటుంటే ఎంత అవసరమో, ఎంత తినాలో మెదడు సిగ్నల్స్ ఇస్తుంది. ఫుడ్‌‌ బాగా నమలడం వల్ల శరీరంలోకి కేలరీలు తక్కువగా వెళ్లి  బరువు పెరగరు. అందుకే, ఒక్కో ముద్దను దాదాపు 30 సెకన్లు నమలాలి అంటున్నారు వాళ్లు. 
  • బరువు తగ్గాలనుకున్నవాళ్లు ఎక్కువసేపు ఆకలితో ఉండొద్దు. ఎందుకంటే బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఫాస్ట్‌‌గా తింటారు కాబట్టి. దానివల్ల బరువు పెరుగుతారు. అందుకే, టైంకు ఫుడ్‌‌ తినడం బెటర్‌‌‌‌. 
  • తినేటప్పుడు జనరల్‌‌గా ఎన్నిసార్లు, ఎంతసేపు నములుతున్నారో గమనించుకోవాలి. దాన్ని బట్టి టైం అడ్జస్ట్‌‌ చేసుకోవాలి. 
  • ఫైబర్‌‌‌‌ ఫుడ్‌‌ను ఎక్కువగా తినాలి. పీచు బాగా ఉన్న ఫుడ్‌‌ అయితే ఎక్కువసేపు నమలాల్సి ఉంటుంది. దాంతో నెమ్మదిగా ఎక్కువసేపు తింటారు. 
  • తినేముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే శరీరంలోకి వెళ్లే క్యాలరీల  సంఖ్య తగ్గుతుంది.
  • గాడ్జెట్స్‌‌ వాడుతూ, టీవీ చూస్తూ తినకూడదు. అలా చేస్తే ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో తెలియదు. అందుకే తినేటప్పుడు ధ్యాసంతా తిండిమీదే ఉండాలి.