ఆధార్ గుడ్ న్యూస్ : కూల్ గా, నిదానంగా అప్‌డేట్ చేసుకోండి

ఆధార్ గుడ్ న్యూస్ : కూల్ గా, నిదానంగా అప్‌డేట్ చేసుకోండి

ఆన్ లైన్‌లో ఆధార్ ఉచితంగా అప్ డేట్ చేసుకునే గడువును మరోమారు పొడిగించింది యూఐడీఏఐ.  వాస్తవానాకి 2023 సెప్టెంబర్ 14 తో డువు ముగియాల్సి ఉంది. కానీ తాజాగా మరో మూడు నెలల పాటు ఉచితంగా ఆధార్ అప్ డేట్ గడువును పొడిగించింది. అంటే డిసెంబర్ 14వ తేదీ వరకు ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ అప్పటికీ అప్‌డేట్ చేసుకోకపోతే మాత్రం ఫీజు పే చేసి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ALSO READ : షారూఖ్ మేనేజర్ పూజ జీతం.. స్టార్ హీరో రెమ్యునరేషన్ అంత!

 ఆధార్ లో జెండర్ తో పాటుగా  బర్త్ డే, అడ్రస్ తదితర వివరాలు  నిర్దేశిత గడువు వరకు ఫ్రీగానే అప్ డేట్ చేసుకోవచ్చు. ఆధార్ తీసుకుని పదేండ్లు దాటిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని సూచించింది . అందుకు ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను   అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.


ఆన్​లైన్​లో ఉచితంగా అప్డేట్​ చేసుకోండిలా..

  • ముందుగా ఆధార్ అధికారిక వెబ్​సైట్ https://myaadhaar.uidai.gov in ఓపెన్ చెయ్యండి.
  • మీ ఆధార్ నంబ‌రు, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. (ఆధార్​కు మొబైల్​ నంబర్​ లింక్​ అయితేనే ఓటీపీ వస్తుంది)అక్కడ వివ‌రాల‌న్నీ ఒకసారి చెక్ చేసుకోండి.
  • అన్ని వివ‌రాలు సరిగ్గానే ఉంటే.. I verify that the above details are correct పై క్లిక్ చేసి లాగౌట్ అవ్వండి.
  • ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే.. అక్క‌డ ఉన్న మెనూ ప్రకారం.. ఏ వివ‌రాలు అప్డేట్​ చేసుకోవాల‌నుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
  • త‌ర్వాత దానికి సంబంధించిన ధ్రువప‌త్రాన్ని అప్లోడ్​ చేయండి.
  • ముఖ్యంగా అది 2 MB కంటే త‌క్కువ సైజులో, JPEG, PNG లేదా PDF ఫార్మాట్​లో మాత్రమే ఉండాలి.
  • అది అప్లోడ్​ అయిన త‌ర్వాత సబ్మిట్​పై క్లిక్ చేస్తే స‌రిపోతుంది.