పంజాగుట్ట, వెలుగు: ప్రపంచ ఆస్టియో పోరోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం పీపుల్స్ ప్లాజా వద్ద వాకథాన్ నిర్వహించారు. హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పవన్ జెండా ఊపి వాకథాన్ ప్రారంభించారు.
జాయింట్ రీప్లేస్మ్మెంట్ఆపరేషన్లు చేసుకున్న పేషెంట్లు, వెయ్యి మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. కీళ్ల నొప్పులు ఉంటే నడవకూడదనే అపోహను తొలగించడానికే వాకథాన్ నిర్వహించినట్లు డాక్టర్ పవన్ తెలిపారు.