మీరు నిజాన్ని ఆపలేరు : సానియా మీర్జా

మీరు నిజాన్ని ఆపలేరు : సానియా మీర్జా

గత కొన్ని రోజులుగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త, క్రికెటర్ షోయబ్ మాలిక్‌ విడాకులు తీసుకుంటున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 12ఏళ్ల క్రితం వివాహబంధంతో ఒకటైన ఈ జంట.. విడాకుల రుమార్లపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. తాజాగా ఈ విషయంపై సానియా ఇన్ డైరెక్టుగా స్పందించారు. మీరు నిజాన్ని ఆపలేరు అని సోషల్ మీడియా వేదికగా ఆమె రాసుకొచ్చారు. దాంతో పాటు 2022 కోసం తన దగ్గర సుధీర్ఘమైన, లోతైన క్యాప్షన్ లేదన్న ఆమె.. కానీ తన వద్ద అందమైన సెల్ఫీలున్నాయని చెప్పారు.

ఈ సందర్భంగా ఆమె అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2022లో తనపై వివాదాస్పద కామెంట్లు చేసినా.. తాను మాత్రం కృతజ్ఞతగానే ఉన్నానని సానియా చెప్పారు. ఈ క్యాప్షన్ తో పాటు బ్లాక్ కలర్ క్యాప్ అండ్ టీ షర్ట్ ధరించి ఉన్న ఓ సెల్ఫీని షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.