సక్సెస్​ అవ్వాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే

సక్సెస్​ అవ్వాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే

సక్సెస్​ఫుల్​ పర్సన్​ అవ్వాలంటే కొన్ని రూల్స్​ తు.చ. తప్పకుండా ఫాలో అవ్వాలి. ప్రతి క్షణం తాము అనుకున్న దానికోసం ప్రయత్నించాలి. మారిన పరిస్థితులకు తగ్గట్టు తమని తాము మార్చుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఎవర్ని వాళ్లు నమ్మాలి. ఇవన్నీ ఓకే కానీ, మరి సక్సెస్​ఫుల్​ పర్సన్​ అవ్వాలంటే చేయకూడని పనులేంటో తెలుసా! సక్సెస్​కి అడ్డంకిగా మారే వాటిని వదిలేయకపోతే లైఫ్​లో ఎప్పటికీ ముందుకెళ్లలేరు. అవేంటంటే..

సక్సెస్​కి పునాది నమ్మకమే.. దాని వేలు పట్టుకుని నడిస్తే.. ఎంత దూరం వెళ్లినా అలసట అనిపించదు. అనుకున్నది సాధించేవరకు ఆలోచనలు దారి మళ్లవు. ఒకవేళ అదే తోడులేకపోతే  ఎంత టాలెంట్​ ఉన్నా అడుగు ముందుకేయలేం. ప్రతి క్షణం ఓడిపోతామనే భయం వెంటాడుతుంది. దానివల్ల చివరికి ప్రయత్నించకుండానే ఓటమిని ఒప్పుకుంటారు చాలామంది. అలా వాళ్లని వాళ్లు తక్కువ అంచనా వేసుకోవడం వల్ల ఎప్పుడూ వెనకే ఉండిపోతారు. ఈ సమస్యని అధిగమించి ఎవర్ని వాళ్లు నమ్మితే ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా గమ్యం చేరుకుంటారు. ఒకవేళ అనుకున్నది సాధించలేకపోయినా ఆ నమ్మకం ఏదో ఒకరోజు వాళ్లని సక్సెస్​ఫుల్​​ పర్సన్​గా నిలబెడుతుంది.

  • సంతోషం, కోపం, బాధ.. ఈ మూడింటి  చుట్టూనే అందరి జీవితాలు తిరుగుతుంటాయి. కానీ, వీటిని బట్టే జీవితాలు నడిస్తే లైఫ్​లో ఎప్పటికీ సక్సెస్​ అవ్వలేం. అందుకే ఎమోషనల్​గా ఏ నిర్ణయం తీసుకోకూడదు. మనల్ని సక్సెస్​ వైపు నడిపించే ప్రతి స్టెప్​ని ఒకటికి పదిసార్లు ఆలోచించి వేయాలి. 
  • దారేదైనా ఎత్తు పల్లాలు ఉంటాయి. వాటిని కనిపెట్టుకుని ముందుకెళ్తెనే సేఫ్​గా ఇంటికి చేరతాం. అలానే సక్సెస్​ బాటలోనూ  కొన్ని  సమస్యలుంటాయి. వాటికి ఒక్కసారి చిక్కితే తప్పులేదు.. కానీ పదేపదే వాటిల్లోనే కూరుకుపోతే ఎప్పటికీ సక్సెస్​ అందుకోలేరు.​ అందుకే ప్రతి చిన్న పొరపాటుని ఒక గుణపాఠంలా చూడాలి. మరోసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తపడాలి. కొత్త తప్పులు దొర్లినా పర్లేదు. కానీ, చేసిన తప్పుని మళ్లీ రిపీట్​ చేయకూడదు.
  • చిన్న సమస్య రాగానే కుంగిపోతుంటారు కొందరు. దానికి సొల్యూషన్​ వెతక్కుండా  కూర్చొని బాధపడుతుంటారు. ఈ నేచర్​ ఉన్నవాళ్లు ఎప్పటికీ సక్సెస్​ అవ్వలేరు. సమస్య ఏదైనా సరే,  ధైర్యంగా ఎదుర్కొనేవాళ్లే జీవితంలో ముందుకెళ్తారు. పదిమందికీ ఇన్​స్పిరేషన్​లా నిలుస్తారు. 
  • ప్రొఫెషన్​ ఏదైనా సరే సక్సెస్​ మంత్ర ‘లెర్నింగ్’. కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్లే జీవితంలో ఎదుగుతారు. అలాగే  ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి. కాబట్టి.. ఎదుటివాళ్లను అంగీకరించే గుణం అలవాటు చేసుకోవాలి. ఇతరులను వేలెత్తి చూపించకూడదు. కొన్ని సందర్భాల్లో అవతలివాళ్ల ఆలోచనలు వేరుగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఎదుటివాళ్లు చెబుతున్నది విని, వాటినుంచి అవసరమయ్యే పాయింట్స్​ తీసుకోవాలి. అప్పుడే జీవితంలో సక్సెస్​ అవుతాం.