అతడు ఆడుతున్నప్పుడు టీవీ ఆన్ చేయాల్సిందే

అతడు ఆడుతున్నప్పుడు టీవీ ఆన్ చేయాల్సిందే

సౌతాఫ్రికా డాషింగ్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌‌ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫ్యాన్స్ ముద్దుగా మిస్టర్ 360 అని పిల్చుకునే ఏబీ.. గ్రౌండ్‌‌లోని అన్ని వైపులా అలవోకగా షాట్లు కొట్టగలడు. ధనాధన్ బ్యాటింగ్‌‌తో ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లలో అందర్నీ ఉర్రూతలూగిస్తుంటాడు. తాజాగా డివిలియర్స్ మీద ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రెండేళ్లు ప్రాతినిధ్యం వహించిన వాట్సన్.. డివిలియర్స్, కోహ్లీతో కలసి ఆడటం తన కెరీర్‌లో మర్చిపోనిదిగా చెప్పాడు. ‘ఆర్సీబీ తరఫున విరాట్‌‌తో కలసి ఆడటం నా కెరీర్‌‌లో ఓ హైలైట్. అదో అద్భుతమైన అనుభవం. క్రికెట్‌లోనే గాక వ్యక్తిగతంగా కూడా అతడో ఆసక్తికరమైన వ్యక్తి. ఇక, ఏబీ డివిలియర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే.. అతడు ఆడేటప్పుడు పక్కా టీవీ ఆన్ చేయాల్సిందే’ అని వాట్సన్ పేర్కొన్నాడు.