
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆఫీసులు, షాపింగ్ మాల్స్‌ల్లో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. తాజాగా మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో కూడా కరోనా కట్టడికి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. కలెక్టర్‌ను కలవాలంటే కచ్చితంగా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందేనని సిబ్బంది అంటున్నారు. అందుకోసం ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కరోనా పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కరోనా నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే కలెక్టర్‌ను కలుసుకోవడానికి అనుమతిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకే విజిటర్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని సిబ్బంది అంటున్నారు. కలెక్టరేట్ కార్యలయ సిబ్బంది ఓవర్ యాక్షన్‌పై విజిటర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.