
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ ట్వీట్ చేశారు. శనివారం ఉదయం శివరాజ్ సింగ్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. దీంతో ఆయన వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూనే సెటైరికల్‌గా విమర్శలు చేశారు కమల్‌నాథ్. తాము కరోనా గురించి సీరియస్‌గా తీసుకోవాలని చెప్పినప్పుడు మీరు జోకులేయకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటే అసలు ఆ మహమ్మారి బారినపడే పరిస్థితే వచ్చేదికాదన్నారు.
‘‘శివరాజ్‌జీ మీరు కరోనా బారినపడ్డారని తెలిసి బాధపడ్డాను. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. కానీ, కరోనా వైరస్ వ్యాప్తిపై మేము (కాంగ్రెస్) సీరియస్‌గా పని చేస్తుంటే.. నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి డ్రామా చేస్తోందని మీరు కామెంట్లు చేయడం బాధాకరం. మొదటి నుంచి మేము కరోనా చాలా సీరియస్ డీసీజ్ అని చెబుతూ వచ్చాం. ప్రతి ఒక్కరూ సేఫ్టీ ప్రొటోకాల్ పాటించాలని చెప్పాం. కానీ, కరోనా వ్యాపిస్తున్న సమయంలో మీరు (శివరాజ్ సింగ్) కనీసం జాగ్రత్తలు పాటించలేదు. కరోనాపై జోకులేయడం మానేసి నిబంధనలు పాటించి జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు మీరు వైరస్ బారినపడేవారే కాదు. జరిగిందేదో జరిపోయింది త్వరగా కోలుకుని మళ్లీ తిరిగి విధుల్లో చేరుతారని ఆశిస్తున్నా’’ అన్నారు కమల్‌నాథ్.