ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్ట్ సీరియస్.. ప్రజలను గ్యాస్ ఛాంబర్లో ఉంచాలనుకుంటున్నారా..

ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్ట్ సీరియస్.. ప్రజలను గ్యాస్ ఛాంబర్లో ఉంచాలనుకుంటున్నారా..

వాయి కాలుష్యం ఇంత దారుణంగా పెరిగిపోతోంది.. పట్టించుకోరా.. ప్రజలను గ్యాస్ ఛాంబర్ లో ఉంచాలనకుంటున్నారా అని ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజల దీనస్థితికి బాధ్యత వహించాలని పేర్కొంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 999 ని తాకుతోంది. ఇంతకు మించి ఆ మిషన్ నమోదు చేయలేదు.. అంటే ఇదే అత్యధికం అన్నమాట. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని.. ఇది ప్రమాదకర స్థాయిలో ఉందని పేర్కొంది. 

ఢిల్లీ వాయు కాలుష్యంపై పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించారు. పెరుగుతున్న కాలుష్యం స్థాయిలు, GRAP3 చర్యలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. 

కాలుష్యం పై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ స్పందించారు.  ఒక్క ఢిల్లీలోనే కాదు ఉత్తర భారత దేశంలోనూ ఇదే పరిస్థితి. అన్ని ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి.. ఢిల్లీలో వాయు కాలుష్యానికి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ నిందలు వేస్తోంది.. యూపీ, హర్యానా లో కూడా కాలుష్యం విపరీతంగా పెరిగింది. దీనికి కేజ్రీవాల్ బాధ్యులు కాదు.. ఇప్పుడు తక్షణమే చర్యలు చేపట్టాలని కేంద్ర పర్యావరణ మంత్రికి విజ్ఞప్తిచేశారు.  

ALSO READ :- వెరైటీ : కేక్ టాపర్స్ కలెక్షన్ ఆమె హాబీ...