వెరైటీ : కేక్ టాపర్స్ కలెక్షన్ ఆమె హాబీ...

వెరైటీ : కేక్ టాపర్స్ కలెక్షన్ ఆమె హాబీ...

ఒక్కొక్కరికి ఒక్కో హాబీ ఉంటుంది. ఆ హాబీనే వాళ్లకి గుర్తింపు తెచ్చిపెడుతుంది. అమెరికాలోని ఫ్లుటన్ సిటీలో ఉండే బార్బరా బింజెర్ కి కూడా ఓ హాబీ ఉంది. అదేమంటే వెరైటీ వెడ్డింగ్ కేక్ టాపర్స్ కలెక్ట్ చేయడం. ఈమె దగ్గర ఇప్పటికే 125కి పైగా కేక్ టాపర్స్ ఉన్నాయి.

బార్బరా రిటైర్డ్ టీచర్. మొదటిసారిగా 1983లో కేక్ టాపర్ కొన్నది. అప్పట్లో ఆ కేక్ టాపర్ కోసం రెండు డాలర్లు ఖర్చుపెట్టింది. రకరకాల పూలతో అందంగా డెకరేట్ చేసిన ఆర్చ్ కింద కొత్త దంపతులు నిల్చొని ఉన్న ఆ కేక్ టాపర్ ఆమెకు చాలా నచ్చింది. అప్పటి నుంచి వెడ్డింగ్ కేక్ టాపర్స్ మీద ఇష్టం మరింత పెంచుకుంది.

రకరకాల డిజైన్లలో ఉన్న కేక్ టాపర్స్ కోసం షాపుల్లో వెతికేది. ఎక్కడైనా, ఏ షాపులోనైనా అందంగా, వెరైటీ డిజైన్ లో ఉన్న కేక్ టాపర్ కనిపించిందంటే చాలు.... వెంటనే కొనేసేది. టీచర్ గా రిటైరయ్యాక ఖాళీ టైమిని కేక్టాపర్స్ కలెక్ట్ చేసేందుకే
ఉపయోగిస్తోంది. 

మనవరాళ్లకి తన గుర్తుగా.... 

కొత్త జంటలో ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు. అదే విధంగా ఏ రెండు కేక్ టాపర్స్ కూడా ఒకేలా ఉండవు. నేను ఒకరి జీవితంలో ముఖ్యమైన రోజుకి సంబంధించిన జ్ఞాపకాన్ని కలెక్ట్ చేస్తున్నాను. కేక్ టాపర్స్ సంతోషానికి చిరునామా. జీవితంలో మరో దశలోకి కలిసి అడుగు వేయాలనే మెసేజ్ ని చెప్పకనే చెబుతాయి కూడా. 

అంత ముఖ్యమైన వాటిని ఎందుకు పడేస్తారు? అని ఆలోచిస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నా కలెక్షన్ లో 1920లో చాలా పాపులర్ అయిన, అరుదైన క్యూపీ బ్రైడ్ అండ్ గ్రూమ్ టాపర్ ఉంది. దీన్ని పదిహేనేండ్ల క్రితం 350 డాలర్లకు కొన్నాను. నా మనవరాళ్లు వాళ్ల వెడ్డింగ్ కేకు కోసం నా కలెక్షన్లోంచి నచ్చిన టాపర్ తీసుకున్నారు. నా జ్ఞాపకంగా చిన్న వస్తువైనా తమ దగ్గర ఉన్నందుకు వాళ్లు చాలా హ్యపీ అంటోంది బార్బరా.

ALSO READ :- అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకూ పొంచి ఉన్న ప్రమాదం : నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక