రాళ్లతో తలలు పగలగొట్టి ప్రేమికుల హత్య

V6 Velugu Posted on Jun 23, 2021

  • కులాల కారణంగానే చంపారని అనుమానం
  • కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఘటన

ప్రేమకోసం మరోజంట బలైంది. కులాల అంతరం కారణంగా.. ప్రేమికులను రాళ్లతో కొట్టిచంపారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో మంగళవారం జరిగింది. విజయపుర జిల్లాలోని సలాదహళ్లి ప్రాంతంలో 19 ఏళ్ల యువకుడు, యువతి పరువు హత్యకు గురయ్యారు. స్థానికంగా నివసించే ముస్లీం యువతి, దళిత యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. ఎన్నిసార్లు మందలించినా వారిలో మార్పు రాకపోవడంతో.. మంగళవారం ప్రేమికులిద్దరినీ యువతి కుటుంబ సభ్యులు రాళ్లతో తలలు పగలగొట్టి చంపారు. ఘటన జరిగిన తర్వాత యువతి తండ్రి, అన్నలు, మరియు ఇద్దరు బంధువులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tagged karnataka, love, honour killing, casts, Vijayapura, , Saladahalli, lovers murder

Latest Videos

Subscribe Now

More News