
దహెగాం, వెలుగు : బైక్‌కొనుక్కునేందుకు తల్లిదండ్రులు పైసలియ్యలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు సూసైడ్‌చేసుకున్నాడు. ఈ ఘటన ఆసిఫాబాద్‌జిల్లా దహెగాం మండలంలో ఆదివారం జరిగింది. ఎస్సై విక్రమ్‌తెలిపిన వివరాల ప్రకారం.. కొంచవెల్లి గ్రామానికి చెందిన ఆదె శేఖర్ (25) మద్యానికి బానిసై, పైసలు ఇవ్వాలని తరచూ తల్లిదండ్రులను వేధించేవాడు.
ఇందులో భాగంగానే బైక్ కొనుక్కునేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని శుక్రవారం ఉదయం తల్లిదండ్రులను అడగడంతో వారు లేవని చెప్పారు. దీంతో బయటకు వెళ్లిపోయిన శేఖర్.. కొద్ది సేపటి తర్వాత ఇంటికి వచ్చి గడ్డి మందు తాగానని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాలలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా.. అక్కడి నుంచి వరంగల్‌ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శనివారం సాయంత్రం చనిపోయాడు.