
బషీర్‌బాగ్, వెలుగు: ప్రేమ ఫెయిలైందని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ షఫీ తెలిపిన ప్రకారం.. ఒడిశాకు చెందిన బికాస్ శష్మల్(20) హిమాయత్ నగర్లో ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు. ఈనెల13న ఫ్రెండ్స్బయటకు వెళ్లి రాత్రి 11.30 గంటలకు తిరిగి వచ్చారు. డోర్ కొడితే బికాస్ ఎంతకూ తీయలేదు.
కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో వెళ్లి, డోర్ పగలగొట్టారు. బికాస్ చేతిని కట్ చేసుకొని, ఉరేసుకున్నట్లు గుర్తించారు. మృతుడు.. ఒడియా భాషలో ప్రేమిస్తే బాధను ఎదుర్కోవాలి.. ఆ బాధ పోవాలంటే చనిపోవాలని స్టేటస్ పెట్టినట్టు.. కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.