
ఓ యువకుడు తనపై దాడి చేసి దొంగతనం చేశారని ట్విట్టర్ లో పోస్టు చేస్తూ ... కేటీఆర్, హైదరాబాద్ సీవీ ఆనంద్ కు ట్యాగ్ చేశాడు. నిన్న రాత్రి ప్రవీణ్ అనే యువకుడు ఆటోలో వస్తున్న సమయంలో ఆటో డ్రైవర్... అతని స్నేహితులు తనపై దాడికి పాల్పడ్డాడన్నారు. తన దగ్గర ఉన్న వస్తువులు దోచుకున్నారన్నారు. దీంతో అతడు వెంటనే వారి నుంచి తప్పించుకొని ఎల్బీ నగర్ పెట్రోలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు. అయితే పోలీసులు మాత్రం తన ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాడు. ఆటోను పోలీసులు ముందు ఆపి పాస్ చేసినప్పటికీ పోలీసులు ఏమాత్రం స్పందించలేదని చెబుతున్నాడు. తన స్థానంలో ఓ అమ్మాయి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. అదే ఆటోలో అమ్మాయి ఉంటే.. మరో దిశ ఘటన జరిగేదని తెలిపాడు ప్రవీణ్. తన గోడును మంత్రి KTR కి,హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కి చెప్పుకున్నాడు ప్రవీణ్.
Yesterday night I was robbed & attacked by auto driver and his friends. I escaped from them and immediately complained to lb nagar patrolling police about the issue that I faced, police are not respond even auto stop & pass in front of them.@CPHydCity @KTRTRS @hydcitypolice
— Praveen Kanna (@ipraveenkanna) January 31, 2022