
ములకలపల్లి, వెలుగు: నాటు వైద్యం వికటించి భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామానికి చెందిన గుగులోత్హతీరామ్(23) ఫారెస్ట్డిపార్ట్మెంట్లో డైలీ లేబర్. మద్యానికి బానిసై ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఎలాగైనా అతనితో తాగుడు మాన్పించాలని కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన నాటు వైద్యుడిని సంప్రదించారు. మంగళవారం హతీరామ్తో పసరు మందు తాగించగా కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.