- రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో విషాదం
ఎల్బీనగర్, వెలుగు: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఓ యువకుడు మరణించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో గురువారం ఈ ఘటన జరిగింది. హయత్ నగర్ సమీపంలోని కుంట్లూర్ లో కొద్ది రోజులుగా క్రికెట్ టోర్నమెంట్లు కొనసాగుతున్నాయి.
ఈ టోర్నమెంట్లలో కావాడిపల్లి గ్రామం మూడో వార్డు సభ్యుడు బండారి సురేశ్ (27) పాల్గొన్నారు. క్రికెట్ ఆడుతుండగా ఛాతీలో నొప్పి రావడంతో ఆస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.
