
- సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘటన
సిద్దిపేట రూరల్, వెలుగు: కరెంట్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేటలో జరిగింది. సిద్దిపేట వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపిన ప్రకారం.. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన పోతిరెడ్డి వివేక్ కిరణ్ రెడ్డి (22) , సోమవారం ఉదయం జిమ్ కు వెళ్లి తిరిగి ఇంటికెళ్లేందుకు కిందకు దిగాడు. రోడ్డుపైన పడిపోయిన ఓ రెస్టారెంట్ ఫ్లెక్సీ తీని పక్కన పెడుతుండగా.. ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫార్మర్ కు తాకడంతో కరెంట్ షాక్ కొట్టి స్పాట్ లో చనిపోయాడు. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదుతో రెస్టారెంట్ ఓనర్ తో పాటు, బిల్డింగ్ ఓనర్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతుడు కిరణ్ రెడ్డి ఇటీవలే ఐఐటీ పూర్తి చేసి జాబ్ సెర్చ్ లో ఉన్నాడు.