లవ్ ఫెయిల్.. యువకుడు సూసైడ్

లవ్ ఫెయిల్.. యువకుడు సూసైడ్

మాదాపూర్, వెలుగు :  లవ్ ఫెయిల్ కావడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన మాదాపూర్​ పీఎస్​పరిధిలో జరిగింది. ఎస్ఐ మాల్యానాయక్ తెలిపిన​వివరాల ప్రకారం.. అసోంలోని ఐలాఖండి జిల్లా దినానంత్ పూర్ గ్రామానికి చెందిన  సంజు బర్మన్(23) మాదాపూర్ ​సిద్ధిక్ నగర్​లోని ఓ రూమ్​లో ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాడు. సంజు మాదాపూర్​లోని గోల్డెన్ స్టార్ ​హోటల్ లో  హౌస్​కీపర్ గా పనిచేస్తున్నాడు.  సంజు తన సొంతూరికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు.  ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో  బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తన రూంలో ఉరేసుకున్నాడు. సంజు రూమ్ మేట్స్ కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.