పిలగాడిని పతంగే ఎగరేస్కపోయింది

పిలగాడిని పతంగే ఎగరేస్కపోయింది

పతంగి ఎగిరేసుడేమో గానీ.. ఒక్క నిమిషం పాటు ప్రాణం పోయినంత పనైంది. పతంగి ఎగిరేస్తూ.. తాడుతోపాటు గాల్లోకి లేచిన ఓ వ్యక్తి.. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. ఈ ఘటన శ్రీలంకలో డిసెంబర్​20న జరిగింది. శ్రీలంకలో పొంగల్​ సందర్భంగా పెద్ద పెద్ద గాలిపటాలు ఎగురవేస్తూ.. పండగను సెలబ్రేట్​చేసుకోవడం ఆనవాయితీ. ఈ నెల 20న జాఫ్నాలోని పాయింట్ పెడ్రోలో పతంగుల పోటీ నిర్వహించారు. పోటీల్లో భాగంగా యువకులు జట్లుగా పెద్ద పెద్ద గాలిపటాలు ఎగురవేయడం స్టార్ట్​ చేశారు. ఓ గ్రూపులో పెద్ద పతంగి ఎగురవేస్తూ.. దాని తాడును ఒక్కసారిగా వదిలారు. ఓ వ్యక్తి తాడు విడవకపోవడంతో కైట్​తోపాటే గాల్లోకి 30 అడుగుల ఎత్తుకు లేచాడు. నిమిషంపాటు గాల్లోనే వేల్లాడిన ఆ వ్యక్తి పతంగి కొంచెం కిందకు దిగగా.. తాడు వదిలి భూమ్మీద దూకాడు. దాదాపు పదిహేను ఇరవై అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకడంతో ఆ యువకుడి కాళ్లు విరిగాయని సమాచారం. ఇదంతా ఓ వీడియోలో రికార్డు కాగా.. ఆ వీడియో సోషల్​ మీడియాలోవైరల్ అయింది.