గ్రూప్ 4 ఫలితాల్లో మెరిసిన నిర్మల్ యువకుడు

గ్రూప్ 4 ఫలితాల్లో మెరిసిన నిర్మల్ యువకుడు

నిర్మల్/కుంటాల, వెలుగు: గ్రూప్ 4 ఫలితాల్లో నిర్మల్ పట్టణానికి చెందిన యువకుడు కత్రోజు విజయ్ 73వ ర్యాంకు సాధించాడు. రాష్ట్రం మొత్తం మీద 8700 ఉద్యోగాలకు సుమారు 7 లక్షల మంది పరీక్ష రాయగా.. నిర్మల్​ జిల్లాలో విజయ్ అత్యుత్తమంగా నిలిచాడు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే తపనతో రెండేండ్ల నుంచి సివిల్స్, గ్రూప్-1 ఉద్యోగాల కోసం హైదరాబాద్ లో ప్రిపేర్ అవుతున్న విజయ్.. జేఎన్టీయూ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇన్​స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. గ్రూప్–1 ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. అతడి తండ్రి శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నిర్మల్​లో పనిచేస్తున్నారు. కుంటాల మండల కేంద్రానికి చెందిన యువకుడు తాటి సాయితేజ 541 ర్యాంక్ సాధించాడు.