కౌన్సెలింగ్​ చేస్తున్న పోలీసుపై యువకుడి దాడి

కౌన్సెలింగ్​ చేస్తున్న పోలీసుపై యువకుడి దాడి

పోలీసులు కౌన్సెలింగ్​ చేస్తుండగా.. అతడు సహనం కోల్పోయాడు.  ఆగ్రహంతో ఊగుతూ కానిస్టేబుల్పై  దాడికి తెగబడ్డాడు. పోలీసు స్టేషన్లో యువకుడు వీరంగం సృష్టించిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురిలో చోటుచేసుకుంది. గృహ హింస కేసులో యువకుడికి కౌన్సెలింగ్​ ఇచ్చేందుకు పోలీసులు అతడిని స్టేషన్​ కు పిలిపించారు.

మాట్లాడుతున్న పోలీసుపై ఒక్కసారిగా యువకుడు దాడి చేశాడు.  పోలీస్ అధికారి ముఖంపై పంచ్ లు విసిరాడు.  దీంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు .  సరైన ధ్రువపత్రాలు సమర్పిస్తే.. వాటి ఆధారంగా కేసు గురించి ఆలోచిస్తామని మెయిన్ పురి ఏఎస్పీ మధువన్ కుమార్ వెల్లడించారు.