- చేవెళ్లలో యువకుడి హల్చల్
చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల సర్కారు దవాఖానలో మంగళవారం అర్ధరాత్రి ఓ యువకుడు హల్చల్ చేశాడు. తప్పతాగి వచ్చి బ్లేడ్తో గొంతు కోసుకోవడమే కాకుండా విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడికి యత్నించాడు. చేవెళ్లకు చెందిన కృష్ణ గతంలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. మద్యానికి అలవాటుపడి జులాయిగా తిరుగుతున్నాడు.
మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి కోర్టు ఆవరణలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ్నుంచి బయటకు పంపించేశారు. ఆ తర్వాత ప్రభుత్వాసుపత్రికి వెళ్లి సిబ్బందితో దురుసుగా ప్రవరిస్తూ తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసుకున్నాడు.
అక్కడ హాల్లో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడేయడంతో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు యువకుడి పట్టుకొని ట్రీట్మెంట్ ఇప్పించారు. అనంతరం అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.