WHO వార్నింగ్..‌ యువత కరోనాను లైట్‌ తీసుకోవద్దు

WHO వార్నింగ్..‌ యువత కరోనాను లైట్‌ తీసుకోవద్దు
  • మాస్క్‌లు వాడటం లేదని, విహార యాత్రలు ప్లాన్‌ చేసుకుంటురన్న చీఫ్‌

జెనీవా: కరోనాతో యువతకు ముప్పు ఉందని, దాన్ని లైట్‌ తీసుకోవద్దని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) వార్నింగ్‌ ఇచ్చింది. వైరస్‌ను లైట్‌ తీసుకుని సమ్మర్‌‌ హాలిడేస్‌ను ఎంజాయ్‌ చేయలనుకోవడం వల్లే కేసులు పెరిగాయని అన్నారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని, ఇప్పుడు మళ్లీ గుర్తుచేస్తున్నామని అన్నారు. ముసలోళ్లకు ముప్పు ఉన్నట్లే యువతకు కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. కరోనా బారినపడి యువకులు కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధోనమ్‌ గెబ్రెయేన్‌సూచించారు. యువత మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారని, కొన్ని దేశాల్లో ఆంక్షలు సడలించడంతో విహార యాత్రకు సిద్ధం అవుతున్నారని అందుకే ఈ సూచనలు చేస్తున్నామని చెప్పారు. స్వీయ రక్షణతో ఉంటూ తమ చుట్టూ ఉండేవాళ్లను కాపాడాల్సిన బాధ్యత యువకులపై ఉందని చెప్పారు. మహమ్మారిని అడ్డుకోవడంలో యువతదే కీలక పాత్ర అని చెప్పారు. కొన్ని దేశాల్లో వైరస్‌ సెకెండ్‌ ఫేజ్‌ స్టార్ట్‌ అయిందని గుర్తు చేశారు. అలసత్వం వహిస్తే రాబోయే రోజులు మరింత ప్రమాదకరంగా మారుతాయని అన్నారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ పాత్ర అభినందనీయమని, వారికి సెల్యూట్‌ చేస్తున్నానని టెడ్రోస్‌ అన్నారు. ప్రస్తుతం లక్షణాలు లేనప్పటికీ భవిష్యత్తులో కొన్ని అవయవాలపై అది ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర విభాగాధిపతి మైక్‌ రేయాన్‌ అన్నారు. ప్రస్తుతం యువకుల్లో చాలా మందిలో తక్కువ లక్షణాలే కనిపిస్తున్నాయని, కానీ అది ఎప్పుడూ ఒకేలా ఉండదని అన్నారు.