యువత ఫిట్ నెస్ పెంచుకోవాలి .. కన్హా శాంతి వనంలో గ్రీన్ హార్ట్ ఫుల్ నెస్ రన్

యువత ఫిట్ నెస్ పెంచుకోవాలి .. కన్హా శాంతి వనంలో గ్రీన్ హార్ట్ ఫుల్ నెస్ రన్

షాద్ నగర్, వెలుగు: యువత ఫిట్​నెస్​పై మక్కువ పెంచుకోవాలని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో గ్రీన్ హార్ట్ ఫుల్ నెస్ రన్ జరిగింది. ముఖ్య అతిథులుగా బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్,1983 క్రికెట్ వరల్డ్ కప్ ప్లేయర్ సయ్యద్ కిర్మాణి, సినీ నిర్మాత దిల్ రాజు, నటి మెహ్రీన్ పిర్జా హాజరయ్యారు. ఈ రన్ లో వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు, ఔత్సాహికులు పాల్గొనగా, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఫిటె నెస్ పై శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ రన్ లో ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి పాల్గొనడం సంతోషకరమన్నారు.