క్యాంపు ఆఫీసు ముందు యువతి హల్‌చల్

క్యాంపు ఆఫీసు ముందు యువతి హల్‌చల్

క్యాంప్ ఆఫీస్ దగ్గర నిజామాబాద్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతి హల్ చల్ చేసింది. ఏళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతోనే సీఎంని ప్రశ్నించడానికి వచ్చానని నిరుద్యోగ యువతి తెలిపారు. క్యాంప్ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్‌కి తరలించారు. మరోసారి జనాలను మోసం చేసేందుకే కేసీఆర్ దళిత మీటింగ్ పెట్టారని విమర్శించారు. వంద కోట్లు పెట్టి ఎలక్షన్‌లో గెలుస్తారు కానీ ఉద్యోగాలు ఇవ్వరా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.