ప్రేమ పేరుతో లెక్చరర్ వేధింపులు: యువతి ఆత్మహత్య

ప్రేమ పేరుతో లెక్చరర్ వేధింపులు: యువతి ఆత్మహత్య

ఆమె మహిళల హక్కులను కాపాడే ఓ సంస్థ చైర్మన్..ఆమె కొడుకు ఓ కాలేజీలో లెక్చరర్.. తాను పనిచేస్తున్న కాలేజీలో డిగ్రీ చదువుతున్న అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించాడు. ఆమె కాదన్నా వినకుండా వెంటపడ్డా డు. ఆ అమ్మాయికి మరొకరితో నిశ్చితార్థం చేయడంతో.. తల్లిని, కొం దరు రాజకీయ నాయకులను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగాడు.తమ కుటుంబం పరువు పోయిందన్న ఆవేదనతో ఆమె గదిలోకి వెళ్లి ఉరేసుకుంది.

మహబూబ్ నగర్ జిల్లా మాగనూరులో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. ఆ లెక్చరర్ , అతని తల్లిని అరెస్టు చేయాలంటూ యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడికెళ్లినా వదలకుండా.. మాగనూరుకు చెందిన సౌందర్య (20) మక్తల్ పట్టణంలోని సీవీ రామన్ కాలేజీలో మూడేళ్ల కింద డిగ్రీ కోర్సులో చేరింది. కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న హరిశ్చం దర్.. ప్రేమ పేరిట ఆమె వెంట పడ్డా డు. తనకు ఇష్టం లేదన్నా వినలేదు. ఈ విషయం తెలిసిన అతడి కుటుంబ సభ్యులు, కాలేజీ యాజమాన్యం కూడా హరిశ్చం దర్ ను మందలిం చారు. సౌందర్య కుటుంబ సభ్యులు వెంట ఉండి ఆమెతో డిగ్రీ పరీక్షలు రాయిం చారు. తర్వాత బ్యాంకు ఉద్యోగం కోచింగ్ కోసం హైదరాబాద్ కు పంపించారు. హరిశ్చం దర్ అక్కడికి కూడా వెళ్లి, తనను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడ్డా డు. ఇది తెలిసిన సౌందర్య  కుటుంబ సభ్యులు కోచింగ్ మాన్పించి ఆమెను ఊరికి తీసుకెళ్లారు. బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇటీవలే నిశ్చితార్థం చేశారు. ఇది తెలిసిన హరిశ్చం దర్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుం టానని పట్టుబట్టాడు. దాంతో మహిళా నేత అయిన అతడి తల్లి, మాగనూరుకు చెందిన పార్టీ నేతలను తీసుకుని సౌందర్య ఇంటికి వెళ్లిం ది. దీంతో హరిశ్చం దర్ అంటే తనకు ఇష్టం లేదని, తాను పెళ్లి చేసుకోబోనని  సౌందర్య అందరి ముందూ తెగేసి చెప్పింది. అయినా తమకన్నా మంచి సంబంధం దొరుకుతుందా అంటూ బెదిరిం పులకు దిగారు. పెళ్లికి ఒప్పుకున్నాకే అక్కడి నుంచి వెళతామంటూ కూర్చు న్నారు. దీంతో తమ పరువు పోయిం దన్న బాధతో సౌందర్య గదిలోకి వెళ్లి తలుపేసుకుం .మహిళా నేత, ఇతర రాజకీయ నాయకులు, గుమిగూడిన గ్రామస్తులు, సౌందర్య కుటుంబ సభ్యులు  అంతా అక్కడే ఉన్నారు. కాసేపటికి వెళ్లి చూస్తే సౌందర్య ఉరివేసుకుని కనిపించింది. ఇది చూసి మహిళా నేత, ఆమె కొడుకు, ఇతరులు మెల్లగా జారుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొం ది. దీంతోజిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మక్తల్ సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలిం చారు. సౌందర్య కుటుంబ సభ్యులు సదరు మహిళా నేత, ఆమె కుమారుడిపై మాగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.