బోడుప్పల్ లో పాన్ షాప్ యజమానిపై యువకుల దాడి

V6 Velugu Posted on Jul 30, 2021

హైదరాబాద్ బొడుప్పల్ లోని ఓ పాన్ షాప్ లో యువకులు హంగామా  చేశారు. OCB ప్రీమియం పేపర్ కొనేందుకు షాపుకు వచ్చారు. అయితే తమ షాపులో అలాంటి పేపర్ దొరకదని యాజమాని సమాధానం ఇచ్చారు. దీంతో పేపర్ లేకపోతే షాప్ ఎందుకు తెరిచావ్... క్లోజ్ చేయ్ అంటూ షాప్ ఫ్లెక్సీలు చింపేశారు. గ్రనేట్ రాయితో యాజమానిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. షాప్ ఓనర్ మేడిపల్లి పోలీసులకు పిర్యాదు చేశాడు. యువకులు దాడికి యత్నించిన విజువల్స్ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. 

Tagged Hyderabad, attack, Youngsters, Owner, Boduppal, panshop

Latest Videos

Subscribe Now

More News