డిజిటల్ వాస్తు:  ఫోన్, ల్యాప్ ట్యాప్ లో ఇవి ఉన్నాయా.. మీకు ఇబ్బంది కలిగినట్టే

డిజిటల్ వాస్తు:  ఫోన్, ల్యాప్ ట్యాప్ లో ఇవి ఉన్నాయా.. మీకు ఇబ్బంది కలిగినట్టే

పురాణాల ప్రకారం కలియుగం నడుస్తున్నా ప్రపంచాన్ని డిజిటల్​ యుగం శాసిస్తుంది.   ప్రస్తుతం జనాలకు స్మార్ట్​ ఫోన్​ లకు విడదీయరాని బంధంగా మారింది. పొద్దున్నే నిద్రలేవగానే చేతిలో ఫోన్​ పట్టుకొనే లేస్తున్నారు.  ఇక అదే పనిగా  స్క్రీన్​ ను చూస్తూ.. రాత్రి పడుకొనేంత వరకు గడుపుతారు. సెల్​ ఫోన్ లేకపోతే క్షణం గడవని పరిస్థితి. మనచుట్టూ ప్రకృతి వాతావరణం కంటే  ఫోన్​.. ల్యాప్​ట్యాప్​.. డిజిటల్​ వాతావరణం ఎక్కువుగా ఉంది.  దీంతో మన మనస్సు కూడా డిజిటల్​ వాస్తుకు ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ప్రపంచ రాజ్యంపై డిజిటల్​వాస్తు ముద్రవేస్తుంది.  దీనిని శాస్త్రీయంగా నిర్దారించకపోయినా జనాలకు డిజిటల్​ వాస్తపై ఆశక్తి పెరుగుతుంది. నిద్ర పోయేటప్పుడు.. కొన్ని ప్రత్యేక సమయాల్లో ( అతి కొద్ది సమయం) మినహా మనం.. ఫోన్​.. ల్యాప్​ట్యాప్.. కంప్యూటర్ల స్క్రీన్లను చూస్తూ .. ఆ కంటెంట్లను చదువుతూ మన ఆలోచనలను.. భావోద్వేగాలను...స్క్రీన్​ కంటెంట్లు  ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

ప్రస్తుతం యూత్​ పై డిజిటల్​ ప్రభావం చాలా ఎక్కువుగా ఉంది.  ఇప్పుడు అందరికి ల్యాప్​ ట్యాప్, ఫోన్​లతోనే పని.. స్టూడెంట్స్​ దగ్గర నుంచి ఐఏఎస్​.. ఐపీఎస్​ స్థాయి వరకు కచ్చితంగా వాడాల్సిందే.. లేదంటే వారికి నిమిషం గడవని పరిస్థితి.  అందుకే ముఖ్యంగా మొబైల్ ఫోన్​ వాల్​ పేపర్స్​ ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుంది. 

ప్రశాంతంగా ఉండాలన్నా.. పనిలో ఏకాగ్రత పెరగాలన్నా..  ముఖ్యంగా, మొబైల్ ఫోన్‌లో కొన్ని చిన్న మార్పులు చేస్తే.. మంచి ప్రభావంతో మనం చేసే పనిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.  దీంతో సానుకూల ఫలితాలతో అంతా విజయం లభిస్తుందిన ఇక ల్యాప్‌టాప్ విషయంలో  స్క్రీన్‌ ను డస్ట్​ లేకుండా పరిశుభ్రంగా ఉంచడం, కళ్లకు హాయిగా .. ఇబ్బంది లేకుండా ఉండే లైట్ కలర్స్ వాల్‌పేపర్‌లు (తెలుపు, నీలం) వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఫోన్ లో గాని..ల్యాప్​ ట్యాప్​ లో గాని .. వాల్‌పేపర్ ను  రోజులో ఎక్కువ సార్లు చూస్తుంటాం. ఇది చాలా అందంగా.. మనస్సుకు ఆహ్లాదకరంగా ఉండేలా సానుకూలమైన చిత్రాలతో ఏర్పాటు చేసుకోవాలి.  అంతేకాని శిథిలమైన దృశ్యాలు.. హింసను ప్రేరేపించేవి.. బాధను.. విచారాన్ని సూచించే చిత్రాలను ఫొన్​ స్క్రీన్​ పై వాల్​ పేపర్​గా ఉన్నట్లయితే ను నెగటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వండర్​ ఫుల్​ ప్రకృతి దృశ్యాలు, పచ్చని చెట్లు, ఉదయించే సూర్యుడు, ప్రశాంతమైన నీటి ప్రవాహాలు .. ఇష్టమైన దేవుడి చిత్రాలను వాల్‌పేపర్‌గా ఉంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 

ఫోన్లలో అనవసరమైన యాప్​లు.. ఫైల్స్​.. ఫొటోలు ఉంటాయి.  ఇవి స్పేస్​ను ఆక్రమించడమే కాకుండా.. మన మైండ్​ ను గందరగోళానికి గురిచేస్తాయి. ఇలాంటి వాటిని  తొలగించడం వలన ఫోన్ స్పీడ్​గా పని చేయడం వలన మనకు కావలసిన పనిని త్వరగా పూర్తి చేయగలుగుతాం. మెసేజ్‌లు, ఈమెయిల్‌ల నిర్వహణ.. వేల సంఖ్యలో చదవని మెసేజ్‌లు, నోటిఫికేషన్లు మనకు తెలియకుండానే ఒత్తిడిని పెంచుతాయి.  ఇది మన దృష్టిని ముఖ్యమైన పనులపై కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. 

ఫోన్​లో  నోటిఫికేషన్ మేనేజ్‌మెంట్  చాలా అవసరం. అవసరం లేని యాప్‌ల నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం వలన మనం చేసే పనిలో ఇబ్బంది ఉండదు.  టైంటేబుల్​ ప్రకారం.. రోజులో కొన్ని గంటలు ఫోన్​ .. ల్యాప్​ ట్యాప్​ ను పక్కన పెట్టి.. డిజిటల్​ బ్రేక్​ తీసుకోవడం వలన మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా రాత్రి సమయంలో డిజిటల్ డిటాక్స్ చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.