భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎంలు

భారీ భద్రత నడుమ  స్ట్రాంగ్  రూమ్ కు ఈవీఎంలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉప ఎన్నిక పోలింగ్ పూర్తి అయిన తర్వాత పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​కు తరలించారు. అర్ధరాత్రి 2 గంటలకు వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. 

జూబ్లీహిల్స్​లో నాలుగు లక్షలకుపైగా ఓటర్లు ఉండడంతో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల నుంచి ఎన్నికల ఎన్నికల సామగ్రిని ప్రత్యేక వాహనంలో  పోలీస్ బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్​కు చేరుకున్నాయి. ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు రంజిత్‌ కుమార్‌ సింగ్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ఈ నెల14న ఇదే స్టేడియంలో కౌంటింగ్​ జరగనుంది.