
హైదరాబాద్ రోడ్లపై బైక్ స్టంట్లతో కుర్రాళ్లు హడలెత్తిస్తున్నారు. బైక్ స్టంట్లపై పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా, ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఆకతాయిలు మాత్రం ఆగటంలేదు. చంచల్ గూడ దగ్గర 2024 మార్చి 17న ఆదివారం బైకులపై హంగామా చేస్తూ.. హల్చల్ చేశారు కొంతమంది యువకులు. రోడ్లపై పదుల సంఖ్యలో బైకులతో గుమిగూడి ఇష్టానుసారంగా స్టంట్స్ చేస్తున్నారు. వేగంగా రోడ్లపై ట్రిఫుల్ రైడ్ చేస్తూ.. వచ్చిపోయే వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు.
దీంతో వాహనదారులు భయంతో వణికిపోతున్నారు. బైకులతో రోడ్లపై విన్యాసాలు చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలంటున్నారు వాహనదారులు.