కేటీఆర్కు నిరసన సెగ.. కారును అడ్డుకున్న యూత్ కాంగ్రెస్

కేటీఆర్కు నిరసన సెగ.. కారును అడ్డుకున్న యూత్ కాంగ్రెస్

మాజీ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. హైదరాబాద్ అంబర్ పేటలో ఆయన కారును యూత్ కాంగ్రెస్ నాయకులు మోతె రోహిత్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. గత పదేళ్లలో  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసెత్తని కేటీఆర్ ..ఇపుడు సీఎం  రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేయడం తగదన్నారు.

ALSO READ :- ఎంపీ ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా: బండి సంజయ్

 ఖబడ్దార్  .. నిన్ను తిరగనివ్వం.. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.సీఎం రేవంత్ సర్కార్ ఇటీవలే 563 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే..నిన్ననే ఎగ్జామ్ డేట్ ను కూడా ప్రకటించింది టీఎస్పీఎస్ సీ.