నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి గల్లంతైన యువకుడు

నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి గల్లంతైన యువకుడు

నిజాంసాగర్,(ఎల్లారెడ్డి)వెలుగు : కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి యువకుడు గల్లంతయ్యాడు. పిట్లం మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన గైని పండరి (28) శనివారం బైక్ పై ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. గార్డెన్ లోపలికి వెళ్లి పర్యాటకులు చూస్తుండగానే ప్రాజెక్ట్ నీటిలో దూకాడు. ఎంతకూ తేలకపోవడంతో నిజాంసాగర్ పోలీసులకు సమాచారం అందించారు. 

 ఎస్ఐ శివకుమార్ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి పరిశీలించారు. ఒడ్డుపై యువకుడికి బైక్ ఉంది. అతడు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడా..?  లేక దూకిన తర్వాత ఈత రాక నీటిలో మునిగిపోయాడా..? అని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.