డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి : వెంకటేశ్​

డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి : వెంకటేశ్​

తాండూరు, వెలుగు: డ్రగ్స్ తీసుకుంటే ఆరోగ్యాలు, జీవితాలు నాశనమవుతాయని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని బాలల సంక్షేమ సమితి చైర్మన్ వెంకటేశ్​ సూచించారు. గురువారం తాండూరు టౌన్  ఇంద్రనగర్ లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు.  యువకులు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, చెడు వ్యసనాలకు బానిసలుగా మారొద్దని సూచించారు.

 మద్యానికి యువకులు అలవాటు కావొద్దని, మంచిగా చదువుకొని ఉన్నతస్థాయి చేరుకోవాలని తాండూరు ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓ శ్రీలక్ష్మీ, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.