
అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘రామన్న యూత్’. ఈ ఎంటర్‌టైనింగ్ పొలిటికల్ డ్రామాను ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘టైటిల్ క్యాచీగా ఉంది. అభయ్‌లో మంచి యాక్టర్‌తో పాటు రైటర్ కూడా ఉన్నాడు. తను లైఫ్‌లో చూసిన ఊరి అనుభవాలను తెరకెక్కించాడు.
ట్రైలర్ ఫన్‌గా ఉంది. అలాగే ఫన్ వెనక ఒక ఎమోషన్ ఉంది. ఎక్కడైనా యూత్ గెలవాలి. థియేటర్స్‌లోనూ ‘రామన్న యూత్’ గెలవాలి. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు. అభయ్ మాట్లాడుతూ ‘విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ ఇది. ఒక ఊరిలో రాజకీయ నాయకుడిగా ఎదగాలని రాజు అనే యువకుడు చేసిన ప్రయత్నాలు అతని జీవితాన్ని ఎలా మార్చాయి అనేది సినిమాలో ఆకట్టుకునేలా చూపిస్తున్నాం’అన్నాడు.