డెలివరీ బాయ్స్ గా వచ్చి బిజినెస్మెన్ ఇంట్లో చోరీ..

డెలివరీ బాయ్స్ గా వచ్చి బిజినెస్మెన్ ఇంట్లో చోరీ..

ఆన్ లైన్ డెలివరీ బాయ్స్ గా వచ్చి ఓ బిజినెస్మెన్ ఇంట్లో ఇద్దరు యవకులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్  ప్రదేశ్  కాన్పూర్ లో చోటుచేసుకుంది.  నరేంద్ర గుప్తా అనే వ్యాపారవేత్త నివాసంలో ఈ దొంగతనం జరిగింది. కాన్పూర్ లోని  అహిర్వాన్, ఆకాశ్ గంగా కాలనీలో  భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి గుప్తా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేసేందుకు తన  భార్య రష్మి, చిన్న కూతురు నవ్యతో కలిసి గుప్తా మార్కెట్ కు వెళ్లాడు.

ఈ  సమయంలో ఆయన పెద్ద కూతురు న్యాస ఒక్కరే ఇంట్లో ఉన్నట్లు గమనించిన ఇద్దరు యువకులు.. ఆన్ లైన్ డెలివరీ బాయ్స్ గా వెళ్లి ఆమె గొతుపై స్క్రూ డ్రైవ్ పెట్టి  బెదింరించి.. లాకర్ లో ఉన్న రూ.3.50 లక్షల నగదు, రూ.20 లక్షలు విలువ చేసే బంగారు నగలను దోచుకెళ్లారు. ఈ ఘటన తర్వాత ఇంటికి వచ్చిన పేరేంట్స్ కు నాస్య జరిగిన విషయం చెప్పింది.దీంతో నరేంద్ర గుప్తా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..నిందితులను పట్టకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.