టెక్నాలజీ ..యూట్యూబ్​లో కొత్త ఫీచర్లు

టెక్నాలజీ ..యూట్యూబ్​లో కొత్త ఫీచర్లు

యూ ట్యూబ్​ వ్యూయర్స్ ఎంతమంది ఉన్నారో, అందులో సగం మంది యూ ట్యూబ్ క్రియేటర్స్ కూడా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్​కి​ అంత క్రేజ్ ఉంది మరి. అందుకే ఆ యాప్​ ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్స్​తో తెస్తుంటుంది. ఈ మధ్య వచ్చిన అప్​డేట్స్​ ఇవి...

ఫాస్ట్​ ఫార్వర్డ్​ వీడియో స్పీడ్​:  ప్లేయర్ మీద రెండు సార్లు ట్యాప్ చేస్తే  వీడియో10 సెకన్లు ముందుకు వెళ్తుంది. అయితే వీడియో ఫుల్ స్క్రీన్ లేదా పోట్రెయిట్​ మోడ్​లో చూసేటప్పుడు ప్రెస్ చేసి, కిందకి తీసుకెళ్తే ఆటోమెటిక్​గా ప్లే బ్యాక్ స్పీడ్ 2ఎక్స్​కి మారిపోతుంది. దాని మీద నుంచి వేలు తీస్తే, వీడియో నార్మల్ స్పీడ్​లో ప్లే అవుతుంది. ఈ ఫీచర్ వెబ్, ట్యాబ్లెట్స్, మొబైల్స్​లో అందుబాటులో ఉంది. దీన్ని ప్రతి వీడియోకి రెండు సార్లు వాడొచ్చు. 

యూ ట్యాబ్​ :  లైబ్రరీ ట్యాబ్​, అకౌంట్​ పేజ్​ని కలిపి, అంబ్రెల్లా ఆప్షన్​లో పెట్టారు. దాని పేరు యూట్యాబ్​. ఈ సెక్షన్​లో ఇంతకుముందు చూసిన వీడియోలు, ప్లే లిస్ట్​లు, డౌన్​లోడ్స్, పర్చేజ్​​లు, అకౌంట్ రిలేటెడ్ సెట్టింగ్స్, ఛానెల్ ఇన్ఫర్మేషన్​ వంటివి ఉంటాయి. 

వాయిస్ సెర్చ్​:  యూట్యూబ్​లో ఏవైనా వీడియోలు చూడాలంటే సెర్చ్ చేయడానికి టైప్ చేయనక్కర్లేదు. సాంగ్ ప్లే చేసినా, పాడినా, హమ్​ చేసినా ఏ.ఐ. ద్వారా సౌండ్​ని మ్యాచ్ చేసి రిజల్ట్​లో చూపిస్తుంది. 

యానిమేటెడ్ బటన్స్: యూట్యూబ్ క్రియేటర్ వ్యూయర్స్​కి లైక్, సబ్​స్క్రయిబ్​ వంటివి చెప్తే వీడియో ప్లే అయ్యేటప్పుడు అదే సింక్​లో బటన్స్ పైన కనిపిస్తాయి. వాటిని ట్యాప్ చేయగానే మెరుపులు కనిపిస్తాయి. అలాగే టాప్ కామెంట్స్ ఆటోమెటిక్​గా రొటేట్ అవుతూ ఉంటాయి.