టెక్నాలజీ .. వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు

టెక్నాలజీ .. వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు

యూట్యూబ్​ ప్రపంచమంతటా పాపులర్​ అయిన యాప్​. పల్లె నుంచి సిటీ వరకు అందరూ వాడే యాప్​ ఏదంటే యూట్యూబ్.  వాడడానికి చాలా సులువుగా ఉంటుంది. ఎవరికి ఏ సమాచారం కావాలన్నా అందులో దొరుకుతుంది. అందుకే యూట్యూబ్​కి అంత క్రేజ్. అయితే, ఇప్పుడు యూట్యూబ్​ మరో కొత్త ఫీచర్ తెచ్చింది. అది కూడా యూట్యూబ్​ యూజర్లకు బాగా నచ్చుతుంది. అదే ప్లేయబుల్స్. ఈ ఫీచర్​తో యూట్యూబ్​లో ఇకనుంచి గేమ్స్ కూడా ఆడుకోవచ్చన్నమాట. 

వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు

మామూలుగా చిన్నపిల్లలు, పెద్దవాళ్లు కూడా అప్పుడప్పుడు సరదాగా వీడియో గేమ్స్ ఆడుతుంటారు. అయితే ఏ గేమ్ ఆడాలన్నా ముందుగా ఆ యాప్​ డౌన్​లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాతే ఆడుకునే వీలవుతుంది. ఇకమీదట ఎలాంటి యాప్స్ వాడకుండా గేమ్ ఆడాలనుకుంటే యూట్యూబ్​ బెస్ట్ ప్లాట్​ఫాం. వీడియో గేమ్స్ ఆడేవాళ్ల కోసమే యూట్యూబ్​లో గూగుల్ ప్లేయబుల్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ప్లేయబుల్స్ ఫీచర్​ వాడి వీడియో గేమ్స్ ఆడొచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రీమియం యూజర్లకు... అంటే పేమెంట్ యూజర్ల కోసం టెస్టింగ్​లో ఉంది. 28 మార్చి 2024 నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.  ఆ తరువాత పేమెంట్​ యూజర్లతో పాటు అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అందులో 37 గేమ్స్ ఉన్నాయి. ‘యాంగ్రీ బర్డ్స్ షో డౌన్, కానన్ బాల్స్ త్రీడీ, బ్రెయిన్ అవుట్ అండ్ డైలీ క్రాస్ వర్డ్స్, డైలీ సోలిటైర్​ అండ్ జిన్​ రమ్మీ’ వంటి కార్డ్ గేమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో యూట్యూబ్​ ప్రీమియం ధర ఏడాదికి 1,290 రూపాయలు. మూడు నెలల ప్లాన్​కి 399 రూపాయలు. ఒక నెలకు అయితే ప్రి– పెయిడ్ ప్లాన్​139 రూపాయలు. 

థ్రెడ్స్​లో కీవర్డ్​ సెర్చ్​

ఇన్​స్టాగ్రామ్​ ప్లాట్​ఫాం నుంచి థ్రెడ్స్ అనే యాప్​ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఇప్పుడిప్పుడే కొత్త ఫీచర్లు తెస్తోంది. అందులో భాగంగా వచ్చిన కొత్త ఫీచర్ ఏంటంటే.. ఇప్పటివరకు థ్రెడ్స్​లో కీవర్డ్​ సెర్చ్​ ఫీచర్​ లేదు. అది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ‘ఈ ఫీచర్​ని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టెస్ట్​ చేస్తున్నాం. దీని ద్వారా రిలేటెడ్ పోస్ట్​లు, థీమ్స్ ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇది అచ్చం ఎక్స్ (ట్విటర్​)లో లాగానే ఉంటుంది. దీనికి మరిన్ని మెరుగులు దిద్దాలి’ అని ఇన్​స్టాగ్రామ్​ హెడ్ ఆడమ్ మొస్సెరి చెప్పారు. త్వరలోనే దీన్ని అన్ని భాషల్లో తెస్తాం అంటున్నారు. మొదట ఇంగ్లిష్​ మాట్లాడే దేశాల్లో దీన్ని టెస్ట్ చేశారు. తర్వాత స్పానిష్​ మాట్లాడే దేశాల్లో టెస్ట్ చేస్తారట. ఇన్​స్టాగ్రామ్​తో సంబంధంలేకుండా థ్రెడ్స్​ అకౌంట్​ని డిలీట్​ చేసే ఆప్షన్​ అప్​డేట్ చేసిన విషయం తెలిసిందే.  

క్యూఆర్​తో వాట్సాప్​ పేమెంట్స్ 

ఆన్​లైన్ పేమెంట్స్ వచ్చాక అందరూ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికే ఇష్టపడుతున్నారు. అందుకే వాట్సాప్​లో పేమెంట్స్ చేసుకునేలా అప్​ డేట్ అయింది. ఎవరికైనా డబ్బులు పంపాలంటే వాట్సాప్​లో మెసేజ్​ బార్​ ఉన్న రూపాయి ఐకాన్​ మీద ట్యాప్ చేసి, అమౌంట్​ ఎంటర్​ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేశాక యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. అచ్చం ఇలానే క్యూఆర్​ కోడ్​తో కూడా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అదెలాగంటే.. వాట్సాప్​ ఓపెన్​ చేయగానే కుడివైపు పైన మూడు చుక్కలు కనిపిస్తాయి.

వాటిపై ట్యాప్ చేస్తే ‘పేమెంట్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.​ దాని మీద ట్యాప్ చేయగానే యూపీఐతో లింక్​ అయి ఉన్న మీ పేరు కనిపిస్తుంది. దాని కింద ‘సెండ్ పేమెంట్స్’, ‘స్కాన్ పేమెంట్ క్యూఆర్​ కోడ్’ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఎవరికి డబ్బు పంపాలో వాళ్ల కోడ్ స్కాన్ చేసి, పేమెంట్ చేయొచ్చు. ఎవరైనా మీకు పేమెంట్ చేయాలనుకుంటే ఇదే ప్రాసెస్​లో క్యూఆర్​ కోడ్ ఆప్షన్ ఎంచుకుంటే స్కాన్ కోడ్ పక్కన ‘మై కోడ్’ అని ఉంటుంది. దానిమీద ట్యాప్ చేస్తే మీ కోడ్ కనిపిస్తుంది. దాన్ని ఉపయోగించి అవతలి వాళ్లు మీకు మనీ ట్రాన్స్​ఫర్ చేయొచ్చన్నమా ట.