
యూట్యూబ్లో కష్టపడి సొంత కంటెంట్తో వ్యూస్, రెవెన్యూ తెచ్చుకునే వాళ్లు కొందరైతే, పక్కన వాళ్ల కంటెంట్ కాపీ కొట్టి వీడియోలు చేసే వాళ్లు ఇంకొందరు ఉన్నారు. యూట్యూబ్ ఎంత మానిటరింగ్ చేస్తున్నా ఇలాంటి కాపీ బ్యాచ్ పక్కనోళ్ల కంటెంట్ తస్కరించి హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయితే.. యూట్యూబ్ పాలసీ మారింది. ఇకపై ఇలాంటి వాళ్ల ఆటలు సాగవు. జులై 15 నుంచి యూట్యూబ్ పాలసీ పూర్తిగా మారిపోనుంది. కాపీ వీడియోలకు, సేమ్ వీడియో కంటెంట్ను కొంచెం అటూఇటూ చేసి.. వాయిస్ ఓవర్ మార్చి చదివే బ్యాచ్కు యూట్యూబ్ కొత్త పాలసీ ప్రకారం ఇకపై డబ్బులు రావు.
మానిటైజేషన్ రూల్స్ మారుతున్నాయని.. సొంత కంటెంట్ చేస్తున్న వారికి మాత్రమే ఇన్కం వచ్చేలా జులై 15 నుంచి రూల్ తీసుకొచ్చినట్లు యూట్యూబ్ తెలిపింది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రాంలో (YPP) భాగంగా ఈ రూల్ను అమల్లోకి తీసుకొస్తున్నట్లు యూట్యూబ్ పేర్కొంది. ఒక్కరే సేమ్ కంటెంట్ ఉన్న వీడియోలను థంబ్ నెయిల్స్ మార్చి వాళ్లకు చెందిన వేరువేరు ఛానల్లో అప్లోడ్ చేసే బ్యాచ్ కూడా ఉన్నారు. ఇలాంటివాళ్లకు ఈ కొత్త రూల్ అమలుతో ఒక్క ఛానల్ నుంచే డబ్బు వస్తుంది. మిగిలిన ఛానల్స్ కంటెంట్ను కాపీ కంటెంట్గా యూట్యూబ్ గుర్తించి మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకున్నా రూపాయి కూడా ఇన్కం రాకుండా యూట్యూబ్ చెక్ పెట్టనుంది.
ALSO READ : Heinrich Klaasen: వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ తొలగించండి.. ఐసీసీకి క్లాసన్ డిమాండ్
కష్టపడి సొంత కంటెంట్తో వీడియోలు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ.. కుప్పలుగా పేరుకుపోయిన కొన్ని కాపీ ఛానల్స్ ఆట కట్టించే ఉద్దేశంతో యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ మార్చింది. క్లిక్ బైట్ కంటెంట్, లో క్వాలిటీ కంటెంట్, రిపీటెడ్ వీడియోలకు జులై 15 నుంచి చెక్ పడనుంది. ఎడ్యుకేషన్ సంబంధిత వీడియోలు, క్రియేటివ్ కంటెంట్తో ఉండే వ్యూయర్ ఎంగేజింగ్గా ఉండే ఎంటర్టైన్మెంట్ వీడియోలు, ఒరిజినల్ వాయిస్ ఓవర్తో పాటు సొంతంగా విజువల్స్ వాడే కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే మానిటైజేషన్కు అనుమతించనున్నట్లు యూట్యూబ్ కరాఖండిగా చెప్పేసింది. యూట్యూబ్ మానిటైజేషన్ కు అర్హత సాధించాలంటే వెయ్యి మంది సబ్ స్రైబర్లతో పాటు 12 నెలల వ్యవధిలో ఆ ఛానల్ కంటెంట్ 4 వేల గంటలు (Watch Hours) పూర్తి చేసుకోవాలి (లేదా) 90 రోజుల్లో 10 మిలియన్ల యూట్యూబ్ షార్స్ట్ వ్యూ్స్ సాధించాలి.