యూట్యూబర్...యాక్టింగ్​తో  గెలిచారు

యూట్యూబర్...యాక్టింగ్​తో  గెలిచారు

అభయ్ భడోరియా, ఆర్న భడోరియా..  ఈ అన్నా చెల్లెళ్లు ఇద్దరూ చాలా లావుగా ఉంటారు. ఆ మైనస్​ని కూడా ప్లస్​గా మార్చుకుని సోషల్​ మీడియాలో సక్సెస్​ అయ్యారు. అభయ్ భడోరియా 20 అక్టోబర్ 2007న మధ్యప్రదేశ్ ‌లోని భోపాల్ ‌లో పుట్టాడు. వాళ్ల నాన్న రాహుల్ భడోరియా, తల్లి  రీతు భడోరియా, చెల్లెలితో కలిసి ముంబైలో ఉంటున్నాడు ఇప్పుడు. ఈ మధ్యే ఇంటర్మీడియెట్​ చదువు పూర్తి చేశాడు. 

యూట్యూబ్​లోకి...

అభయ్​కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్​ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే యాక్టింగ్​ చేయడం బాగా నేర్చుకున్నాడు. దాంతో ఏడేండ్ల వయసులోనే యాక్టింగ్​ చేసే ఛాన్స్​ వచ్చింది. ‘మరియం ఖాన్ రిపోర్టింగ్ లైవ్’ అనే టెలివిజన్ సీరియల్ ‌లో మొదటిసారి యాక్టింగ్​ చేశాడు. ఇది 2018లో వచ్చింది. ఆ తర్వాత సబ్ టీవీలో వచ్చిన ఒక టాప్ రేటెడ్ కిడ్స్​ షో ‘బల్వీర్ రిటర్న్స్​’లో అభయ్​తోపాటు అతని చెల్లెలు ఆర్న కూడా నటించింది. ఈ షో ద్వారా వాళ్లిద్దరికి చాలామంచి పేరొచ్చింది. అప్పుడే అభయ్​ యూట్యూబ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు.

2018 ఏప్రిల్​లో ‘‘అభయ్​ భడోరియా” పేరుతో యూట్యూబ్​ ఛానెల్​ పెట్టాడు. కరోనా టైంలో సబ్​స్క్రయిబర్స్​ సంఖ్య పెరిగింది. దాంతోపాటే అభయ్​, ఆర్నలకు ఫాలోయింగ్​ కూడా పెరిగింది. ప్రస్తుతం ఛానెల్​కు 7.89 మిలియన్ల సబ్​స్క్రయిబర్స్​ ఉన్నారు. ఛానెల్​లో ఎక్కువగా వ్లాగ్స్​, ఛాలెంజెస్​ వీడియోలు పోస్ట్​ చేస్తున్నారు. ఈ మధ్య షార్ట్స్​ కూడా బాగా చేస్తున్నారు. చిన్న  చిన్న కాన్సెప్ట్స్​తో షార్ట్స్ చేస్తుండడంతో వ్యూస్​ కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ ఛానెల్​లో 390కి పైగా వ్లాగ్స్​ అప్​లోడ్​ చేశారు. ఈ ఛానెల్​తోపాటు ఆర్న ‘ఆర్న భడోరియా’ అనే మరో ఛానెల్​ నడుపుతోంది. వీళ్లు చేసే షార్ట్స్​ అప్​లోడ్​ చేయడానికి కూడా ‘‘ఆర్న అండ్​ అభయ్​ షార్ట్స్​” పేరుతో మరో ఛానెల్​ నడుపుతున్నారు. 

అవకాశాలు

యూట్యూబ్​లో జర్నీ మొదలుపెట్టాక యాక్టింగ్​ అవకాశాలు కూడా బాగానే పెరిగాయి. ఏడేండ్ల వయసులో యాక్టింగ్​ రంగంలోకి అడుగుపెట్టిన అభయ్​ ఆ తర్వాత ‘ఏకలవ్య, తెనాలి రామ, క్యా హాల్, మిస్టర్ పాంచల్’ వంటి షోల్లో కనిపించాడు. ‘విఘ్నహర్త గణేష’తో అభయ్​కి మంచి పేరొచ్చింది. అందులో అభయ్​ వినాయకుడి పాత్ర చేశాడు. బయట 45 డిగ్రీల టెంపరేచర్​ ఉన్నా.. విఘ్నహర్త కోసం భారీ మేకప్ వేసుకున్నాడు. “ఇండస్ట్రీ మాకు చాలా నేర్పించింది. ముఖ్యంగా కష్టపడడం నేర్చుకున్నా. విఘ్నహర్త కోసం భారీ గెటప్ వేసుకోవాల్సి వచ్చింది. 45 డిగ్రీల వేడిలో చాలా కష్టపడ్డా. నా చేతులు ట్యాన్ అయ్యాయి. పాదాలకు చెప్పులు కూడా వేసుకోలేదు” అంటూ తన ఎక్స్​పీరియెన్స్​ చెప్పాడు. సీరియల్స్, రియాల్టీ షోల్లో నటించడమే కాదు.. కమర్షియల్ యాడ్స్​లో కూడా మెరిశాడు అభయ్​. యాక్టింగ్, యూట్యూబ్​ వీడియోలు. షార్ట్స్​ చేయడంలో ఎంత బిజీగా ఉన్నా చదువును నెగ్లెక్ట్​ చేయలేదు. ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకున్నాడు. 

ఈ అన్నా చెల్లెళ్లు ఇద్దరూ వాళ్లకి ఉన్న అధిక బరువు సమస్యని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అందుకే ఇప్పుడు యూట్యూబ్​లో లక్షలమంది ఫాలోవర్స్​, పేరు సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే లక్షల్లో డబ్బు కూడా సంపాదిస్తున్నారు. 

సమ్మర్​ సిరీస్ షార్ట్స్​​

అభయ్​, ఆర్నాలు సీజన్​, ట్రెండ్​కు తగ్గట్టు వీడియోలు చేస్తుంటారు. అందుకే వీళ్ల వీడియోలు బాగా వైరల్​ అవుతుంటాయి. ఈ మధ్య సమ్మర్​లో ఎదురయ్యే సమస్యల మీద చేసిన వీడియోలు బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు.. అమెరికా, జపాన్​, ఇండియాలో ఉండే తేడాలపై కూడా వీడియోలు చేస్తుంటారు వీళ్లు. ఈ వీడియోలు కూడా బాగా వైరల్​ అవుతుంటాయి. ఈ వీడియాల్లో ఇండియన్స్​ మంచితనం చూపిస్తుంటారు. అందుకే వీటికి ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. అన్నా చెల్లెళ్ల రిలేషన్​, వాళ్ల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలను కూడా వీడియోల్లో సరదాగా చూపిస్తుంటారు.