జలపాతంలో కొట్టుకుపోయిన యూట్యూబర్..ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఘటన

జలపాతంలో కొట్టుకుపోయిన యూట్యూబర్..ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఘటన

న్యూఢిల్లీ: వాటర్​ఫాల్స్ ను వీడియో తీసేందుకు వచ్చిన ఓ యూట్యూబర్ గల్లంతయ్యాడు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.  ఒడిశా బెర్హంపూర్ లోని గంజాం జిల్లాకు సాగర్‌‌‌‌‌‌ తుడు (22),  అభిజిత్‌‌‌‌ బెహరా యూట్యూబర్లుగా రాణిస్తున్నారు. కోరాపుట్‌‌‌‌ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించి అక్కడి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే  ఆదివారం సాగర్ తన స్నేహితుడితో కలిసి కోరాపుట్ జిల్లాలో ఉన్న డుడుమా వాటర్ ఫాల్ ను వీడియో తీసేందుకు వచ్చాడు. 

మధ్యాహ్నం పూట డ్రోన్ సాయంతో వాటర్ ఫాల్ ను వీడియో తీస్తున్నాడు. అదే సమయంలో మాచ్‌‌‌‌ఖండ్‌‌‌‌ డ్యామ్ అధికారులు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ఆ సమయంలో రాయిపై నిల్చొని ఉన్న సాగర్..నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఒడ్డుకు చేరుకోలేకపోయాడు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కొంతమంది పర్యాటకులు, స్థానికులు అతడిని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ వారు విఫలమయ్యారు.