డీఎస్సీ 2025 నియామకాలపై ఏపీలో అధికార,ప్రతిపక్షాల వార్ పీక్స్ కి చేరింది. డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే... దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలంటూ సీఎం చంద్రబాబు అండ్ కో ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ( ఆగస్టు 20 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లకు సవాల్ విసిరారు వైసీపీ అధినేత జగన్. తమ హయంలో జరిగిన డీఎస్సీపై సీబీఐ విచారణకు తాను రెడీ అని... మీ హయాంలో జరిగిన డీఎస్సీపై సీబీఐ విచారణకు నువ్వు, నీ కొడుకు రెడీనా అంటూ సవాల్ విసిరారు జగన్.
చంద్రబాబు ఆయన కొడుక్కు సవాల్ విసురుతున్నానని..డీఏఎస్సీ 2025 పై, డీఎస్సీ 2018పై సీబీఐ విచారణకు తాము రెడీ అని అన్నారు జగన్. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని సవాల్ చేస్తున్నామని.. చంద్రబాబు లోకేష్ లు సీబీఐ విచారణకు రెడీ అయితే... వెంటనే లెటర్ రాసి ఇవ్వాలని అన్నారు జగన్.
Bro @naralokesh pic.twitter.com/JJSUzy4dPX
— RAJIV (@KingRajiv) August 20, 2026
జగన్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. డీఎస్సీపై వైసీపీ వరుస నిరసనలతో ఏపీలో పీక్స్ కి చేరిన పొలిటికల్ హీట్ ఇప్పుడు జగన్ సవాల్ తో మరింత ముదిరిందనే చెప్పాలి. మరి, జగన్ సవాల్ కు దీటుగా చంద్రబాబు, లోకేష్ లు రిప్లై ఇస్తారా..?, జగన్ సవాల్ విసిరినట్టుగా డీఎస్సీపై సీబీఐ విచారణకు రెడీ అవుతారా అన్నది ఆసక్తిగా మారింది.
