గురువారం ( డిసెంబర్ ) నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు దగ్గర గోబెల్స్ నేర్చుకోవాలని.. ఆయన గోబెల్స్ కి టీచర్ అని అన్నారు.రైతు సంతోషంగా ఉంటేనే....రాష్ట్రం సంతోషంగా ఉంటుందని అన్నారు. తమ పాలనలో వ్యవసాయం పండగలా ఉంటే...బాబు పాలనలో వ్యవసాయం దండగాలా ఉందని అన్నారు జగన్. తుఫాన్ ను చంద్రబాబు కాబట్టి అపగలిగారు అనేలా బిల్డ్ ఆప్ ఇచ్చారని.. తుఫాన్ బాధిత రైతులకు ఒక్క రూపాయి సాయం అందలేదని అన్నారు జగన్.
చంద్రబాబు 19 నెలల పాలనలో 17 సార్లు ప్రక్రుతి వైపరిత్యాలు వచ్చాయని.. 1100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇవ్వలేదని అన్నారు. ఈ రోజు 19 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు బీమా అందుతుందని.. చంద్రబాబు బకాయి ఉన్న ఇన్పుట్ సబ్సిడీ నిధులు ఎప్పుడూ ఇస్తారో చెప్పాలని అన్నారు జగన్. అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఏట రైతులకి ఇరవై వేలు ఇస్తానని చెప్పి.. కేవలం పదివేలు ఇచ్చి ముప్పై వేలు ఎగొట్టారని అన్నారు జగన్.
రాష్ట్రంలో ఏ పంటకు మద్దతు ధర రావడం లేదని.. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల ధ్యానాన్ని కొనేవాళ్ళు లేరని అన్నారు. దిత్వా తుఫాన్ వస్తుంది అని పదిరోజుల ముందే తెలుసని అన్నారు. తుఫాన్ సమయంలో తమ ప్రభుత్వం ఎలా స్పందించేదో అందరికీ తెలుసని.. రైతుల దగ్గరకు వెళ్ళే పరిస్తితి చంద్రబాబు ప్రభుత్వానికి లేదని అన్నారు జగన్. చంద్రబాబు రైతుల కోసం ఏనాడు అయినా నిలబడ్డాడా అని ప్రశ్నించారు జగన్.
