
డిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో భేటి అయ్యారు. అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ని కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 30న ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని అమిత్‌షాను జగన్ ఆహ్వానించారు. సుమారు 30 నిమిషాలపాటు జగన్, అమిత్ షా భేటీ కొనసాగింది. ఆ తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ చేరుకున్న జగన్ కు అక్కడి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి అంబేద్కర్ ఆడిటోరియంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ఏపీ భవన్ అధికారులు జగన్ ను సన్మానించారు.