పులివెందులలో జగన్ తరపున నామినేషన్​ వేసిన వైఎస్ మనోహర్ రెడ్డి

పులివెందులలో జగన్ తరపున నామినేషన్​ వేసిన  వైఎస్ మనోహర్ రెడ్డి

ఏపీ సీఎం జగన్ తరఫున ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో ఇవాళ( ఏప్రిల్​22) నామినేషన్ దాఖలైంది. సీఎం జగన్ తరఫున ఆయన చిన్నాన్న, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. 

పులివెందులలో సీఎం జగన తరఫున మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. సీఎం వైఎస్ జగన్ తరపున ఆర్డీవో కార్యాలయంలో వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల ఎన్నికల అధికారికి సోమవారం ( ఏప్రిల్​ 22) ఒక సెట్‌తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ నేతలు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. 

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపున ఇవాళ ఒక సెట్ నామినేషన్ వేశామ‌ని, ఈ నెల 25వ తేదీ ఆయనే స్వయంగా వచ్చి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తార‌ని తెలిపారు. 25వ తేదీ ఇక్కడ బహిరంగ సభ ఉంటుందని, మద్యాహ్నాం తర్వాతే ఆయన నామినేషన్‌ వేస్తారని చెప్పారు. రాష్ట్రంలో 70 శాతం ప్రజలు సీఎం జగన్‌ వైపే మళ్లీ చూస్తున్నారని రెండోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని వైఎస్‌ మనోహర్‌రెడ్డి అన్నారు.

సీఎం జగన్ ప్రస్తుతం సిద్ధం బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో బస్సు యాత్ర ముగిసిన అనంతరం నేరుగా పులివెందుల చేరుకుంటారు. ఏపీలో ఈ నెల 25 వరకు నామినేషన్ల దాఖలు చేస్తారని మనోహరరెడ్డి తెలిపారు.