ఎన్నికల కోసమే ఆర్టీసీ విలీనం: వైఎస్ షర్మిల

ఎన్నికల కోసమే ఆర్టీసీ విలీనం: వైఎస్ షర్మిల

హైదరాబాద్, వెలుగు: కేవలం ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే కారణంతోనే రాష్ట్ర కేబినెట్ ఆర్టీసీ విలీనం, మెట్రో విస్తరణ నిర్ణయాలు తీసుకుందని వైఎస్ ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల కల నెరవేరటం శుభ పరిణామమని అన్నారు. “సమ్మెపై ఎస్మా ప్రయోగించి, 29 మందిని పొట్టనపెట్టుకున్నందుకు ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. 

వారికి వేతన సవరణ, అరియర్స్  పీఎఫ్ లాంటి  పెండింగ్​లో ఉన్న తదితర బకాయిలు  మొత్తం 8వేల కోట్లు వెంటనే చెల్లించాలి” అని ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. మెట్రో విస్తరణ వెనుక రియల్ ఎస్టేట్ స్కామ్ ఉందని ఆరోపించిన షర్మిల.. భూముల రేట్లు ఇప్పటికే సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయని గుర్తుచేశారు.