నమ్మి నానబోస్తే.. పుచ్చి బుర్రెలైందట!

నమ్మి నానబోస్తే.. పుచ్చి బుర్రెలైందట!

హైదరాబాద్: రాష్ట్ర సర్కారుపై పదేపదే ప్రశ్నల వర్షం కురిపిస్తున్న వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల మరోమారు కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రైతు రుణమాఫీ హామీని నెరవేర్చకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రుణ మాఫీ చేయని సర్కారు.. రైతు డిఫాల్టర్’ అనే శీర్షికతో వీ6 వెలుగు పత్రికలో ప్రచురితమైన కథనాన్ని జోడిస్తూ ఆమె ఓ ట్వీట్ చేశారు. నమ్మి గెలిపిస్తే, ప్రజల్ని కేసీఆర్ మోసం చేశారని షర్మిల దుయ్యబట్టారు. రైతులను బ్యాంకర్ల దృష్టిలో దొంగల్ని చేశారని.. రుణం ఎగ్గొట్టే ఎగవేతదారులుగా చేశారని విమర్శించారు. చేసిన అప్పులకు వడ్డీ మీద వడ్డీ కట్టలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దొరకు రుణమాఫీ హామీ మాత్రం గుర్తుకు రావడం లేదన్నారు. 

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలైన విధంగా కేసీఆర్ సర్కారు తీరు ఉందని షర్మిల విమర్శించారు. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మూడేండ్లు అవుతున్నా.. ఇప్పటివరకు మాఫీ చేసింది మాత్రం కేవలం 3 శాతం మాత్రమేనన్నారు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టిన చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తల కోసం: 

ఏపీ మంత్రి నానికి ఆర్జీవీ ప్రశ్నల వర్షం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

కానిస్టేబుల్ విధులు కూడా సీపీనే చేశారు